
రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. యూరియా కోసం రైతులు రోడ్డెక్కు తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేటలో.. సహకార సంఘం దగ్గర యూరియా పంపిణీ చేశారు అధికారులు. దీంతో ఎరువుల కోసం ఉదయం నుంచే క్యూ కట్టారు రైతులు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక తమ చెప్పులను క్యూలో ఉంచారు. అయితే రైతుకి ఒక బస్తా చొప్పున మాత్రమే పంపిణీ చేశారు అధికారులు. డిమాండ్ కు తగ్గట్టు యూరియా సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారని మండి పడుతున్నారు రైతులు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. తగినంత యూరియూ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు.