ఐటెం క్వీన్ ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ కు.. కుర్రకారు ఫిదా

ఐటెం క్వీన్ ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ కు.. కుర్రకారు ఫిదా

బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్ తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్ తో క్రేజీ సంపాదించుకొంది. మన తెలుగు డైరెక్టర్స్ ఈ భామ కాల్షీట్ల కొరకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో మూవీ నుంచి రిలీజైన మార్కండేయ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది.  గ్లామర్ ని షోకేస్ చేయడంలో ఎలాంటి హద్దుల్లేని ఈ భామకు లక్ ఉందని చెప్పుకోవాల్సిందే.  

ALSO READ:నమస్తే ఎట్లున్నరు.. తెలంగాణ యాసలో అదరగొట్టిన రష్మిక

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ బ్లాక్ బాస్టర్ వాల్తేరు వీరయ్య లోని బాస్ సాంగ్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఈ సాంగ్ తో రికార్డింగ్ బాక్సులు మోత మోగాయి. తన అందానికి, తన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని టాలీవుడ్ డైరెక్టర్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. 
యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ మూవీ లో కూడా ఐటెం సాంగ్ లో కనిపించింది.. ఇదిలా ఉండగా బోయపాటి,రామ్ కలయికలో వస్తోన్న స్కంద మూవీలో ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో కనిపించబోతోంది. 

ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే తెలుగునాట ఐటెం సాంగ్ చేయడానికే రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకొంటుందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఊర్వశీ రౌతేలా చేసే డ్యాన్స్ తో బాగా ఫేమస్ అయినా ఈ బ్యూటీకు ముందు ముందు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.