నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషనా.. ! : ఊర్వశి రియాక్షన్ ఇదే..

నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషనా.. ! : ఊర్వశి రియాక్షన్ ఇదే..

బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో క్రేజీ సంపాదించుకొంది. అలాగే తరుచూ ఏదో వివాదంలో ఉండే ఊర్వశీ..మరోసారి తన కామెంట్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లేటెస్ట్గా ఊర్వశీ తన రెమ్యూనరేషన్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. 

ఊర్వశీ రౌతేలా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యూనరేషన్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా విలేకరి.. నిమిషానికి రూ.కోటి తీసుకుంటూ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాక్టర్స్గా మీరు ఉన్నారు?  దానిపై మీ రియాక్షన్ ఏంటీ? అని అడగ్గా.. ఊర్వశీ స్పందిస్తూ.. అసలు ఇదొక మంచి విషయం. ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం హ్యాపీనే కదా..సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి ఒక్క యాక్టర్ అదే నమ్మకంతో వస్తారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరూ హై రెమ్యూనరేషన్ తీసుకోవాలనే అనుకుంటారు. అంటూ స్పందించింది. 

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక  సోషల్ మీడియాలో నెటిజన్లు ఊర్వశీని తెగ ట్రోల్‌ చేస్తున్నారు. అలా ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ..వెయిట్‌. ఆమెకు అంత డబ్బు ఎవరు ఇస్తున్నారు? మరీ ముఖ్యంగా ఆమెను ఎవరు చూస్తున్నారు, అలాగే మరో నెటిజన్.. నేను కూడా కోటీశ్వరుడిని కావాలని ప్రతిరోజూ కలలు కంటుంటా..అంటూ స్మైలీ ఎమోజీలు యాడ్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.ఊర్వశీ 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె 'సనమ్ రే' (2016), 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' (2016), 'హేట్ స్టోరీ 4' (2018), మరియు 'పాగల్‌పంటి' (2019) వంటి చిత్రాలలో నటించింది. 

2012లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది. ఇక రీసెంట్ గా తెలుగులో బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్ మూవీస్ లో హైటెమ్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది.