భారత్ కు అమెరికా సీడీసీ నుంచి 3.6 మిలియన్ డాలర్లు

భారత్ కు అమెరికా సీడీసీ నుంచి 3.6 మిలియన్ డాలర్లు

వాషింగ్టన్ : కరోనా మహమ్మారి పై పోరుకు ఇండియాకు అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) అండగా నిలిచింది. కరోనా నియంత్రణకు 3.6 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం ప్రకటించింది. కరోనా మహమ్మారి మాత్రమే కాకుండా భవిష్యత్ వచ్చే ముప్పులను ధీటుగా ఎదుర్కొనేందుకు హెల్త్ సిస్టమ్స్ ను డెవలప్ చేసేందుకు సీడీసీ పలు దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో భాగంగా భారత్ కు ఆర్థికంగా సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ డబ్బును భారత్ కరోనా నివారణకు కరోనా కారణంగా ఏర్పడిన సమస్యలను ఎదుర్కొనేందుకు వినియోగించనుంది. సీడీసీ అందించే మొదటి విడత సహాయాన్ని కరోనా టెస్ట్ లు చేసేందుకు వినియోగించనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచే భారత్ లోని పలు సంస్థలతో సీడీసీ కలసి పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా హెల్త్ సెక్టార్ లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇస్తోంది. భారత్ కు 20 ఏళ్లుగా పలు హెల్త్ స్కీం ల కోసం దాదాపుగా 280 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించినట్లు అమెరికా తెలిపింది.