న్యూఢిల్లీ: బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ కంపెనీకి 1.16 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.9,640.76 కోట్లు) బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అమెరికా కోర్టు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఫౌండర్ బైజూ రవీంద్రన్‌ను ఆదేశించింది. ఆయన తమ ఆదేశాన్ని పాటించడంలో విఫలమయ్యారని, చాలాసార్లు దాటవేసే ధోరణి చూపించారని కోర్టు పేర్కొంది. బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పు వచ్చింది.
రవీంద్రన్ స్థాపించిన బైజూస్ ఆల్ఫా.. లోన్ నిబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం బిలియన్ డాలర్ల లోన్‌లో 533 మిలియన్‌డాలర్లను అక్రమంగా యూఎస్ వెలుపలికి తరలించిందని గ్లాస్‌ట్రస్ట్ ఆరోపించింది. బైజూస్ అల్ఫాను స్వాధీనం చేసుకోవడానికి కోర్టు గతంలోనే గ్లాస్ట్రస్ట్కు అనుమతి ఇచ్చింది. రవీంద్రన్ ఈ తీర్పుపై స్పందిస్తూ.. విచారణ సమయంలో తమ వాదనలను వినలేదని, ఈ డిఫాల్ట్ జడ్జిమెంట్‌పై అపీల్ చేస్తామని ప్రకటించారు.
