మిరకిల్ మినరల్ అంటూ ప్రచారం.. నిషేధించిన యూఎస్

మిరకిల్ మినరల్ అంటూ ప్రచారం.. నిషేధించిన యూఎస్

వాంతులు, విరేచనాలు కావొచ్చని ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం హెచ్చరిక

వాషింగ్టన్: మిరాకిల్ మినరల్ సొల్యూషన్ (ఎంఎంఎస్ ) అంటూ ప్రచారం అయిన బ్లీచ్ ఏజెన్సీ అమ్మకాలపై అమెరికాలో నిషేధం విధించారు. కరోనా నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుందంటూ ప్రచారం అయిన ఎంఎంఎస్ అమ్మకాలపై టెంపరరీగా నిషేధం అమలు చేస్తున్నట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రొడక్ట్ వాడకాన్ని ఎంకరేజ్ చేసిన జెనెసిస్ –2 చర్చ్ ఆఫ్​ హెల్త్ అండ్ హీలింగ్ సభ్యులపై వచ్చిన కంప్లైంట్ ను విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి ఆ ప్రొడక్ట్ అమ్మకాలను నిషేధించాల్సిందేనంటూ తీర్పునిచ్చారు. ఈ మేరకు యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఆదేశాలిచ్చింది.

ఏమిటీ మిరాకిల్ మినరల్ సప్లిమెంట్?
‘‘మిరాకిల్ మినరస్ సొల్యూషన్ ను.. మాస్టర్ ఆఫ్ మినరల్ సొల్యూషన్, మిరాకిల్ మినరల్ సప్లిమెంట్ అని పిలుస్తారు. సోడియం క్లోరైట్ ద్రావణాన్ని ఒక ఆమ్లంతో (సిట్రస్ పండ్ల రసాలు వంటివి) కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఈ మిశ్రమం క్లోరిన్ డయాక్సైడ్ అనే విష రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది, దీంతో వికారం, వాంతులు, విరేచనాలు, డీ హైడ్రేషన్ ఏర్పడి ప్రాణాలు మీదకు రావొచ్చు”అని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం తెలిపింది. మిరాకిల్ మినరల్ సొల్యూషన్ ఒక రసాయన ఉత్పత్తి, ఇది మరొక పదార్థంతో కలిసినప్పుడు శక్తివంతమైన బ్లీచ్​ను ప్రొడ్యూస్ చేస్తుందని వెల్లడించింది.