
Trump Warning: ఇవాళ భారత సాయుధ దళాలు అకస్మాత్తుగా నిర్వహించిన దాడులతో ఆశ్చర్యపోవటం పాక్ తో పాటు ప్రపంచ దేశాల వంతైంది. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్థాన్ లో నక్కి ఉన్న టెర్రరిస్టు క్యాంపులు, వారి బేస్ లను టార్గెట్ చేస్తూ దాదాపు 26 మిస్సైళ్లతో ఇండియా బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 9 ప్రాంతాల్లో టార్గెట్లను భారత్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమెరికా పౌరులకు కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ప్రయాణించాలనుకుంటున్న అమెరికన్లను తమ ప్లాన్లను రద్దు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో వారి పౌరులను ఇండియా పాకిస్థాన్ బోర్డర్ ప్రాంతాలతో పాటు ఎల్ఓసీ దగ్గర్లోని ప్రదేశాల్లో ప్రయాణించొద్దని సూచించింది.
Also Read : 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న
టెర్రరిస్టు దాడులతో పాటు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా కొనసాగుతున్న కాల్పుల దృష్ట్యా తమ ప్రయాణాన్ని పునః పరిశీలించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య జరుగుతున్న పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, రెండు దేశాల్లో విమానాల రద్దులు, గగనతలం మూసివేత వంటి చర్యల గురించి తమకు తెలుసునని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పేర్కొంది.
ప్రస్తుతం గొడవ కొనసాగుతున్న ప్రాంతాలను వెంటనే విడిచి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలని కూడా యూఎస్ తన పౌరులకు సూచించింది. ఈ క్రమంలో అవసరమైన సమాచారాన్ని యూఎస్ ఎంబసీ మెసేజ్ రూపంలో పంపుతుందని యూఎస్ తన పౌరులకు వెల్లడించింది. ఇదే విషయాన్ని మార్చి నెలలో కూడా అమెరికా హెచ్చరిస్తూ పాకిస్థాన్ ప్రయాణాలను మానుకోవలాని సూచించింది. బలూచిస్థాన్, కైబర్ పక్తుంక్వా ప్రావిన్సులకు అస్సలు ప్రయాణించొద్దని పేర్కొంది.