భారత్‌కు ప్రయాణాలు మానుకోండి

భారత్‌కు ప్రయాణాలు మానుకోండి

వాషింగ్టన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు రెండున్నర లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌‌కు వెళ్లే ఆలోచనలు ఉంటే మానుకోవాలని తమ దేశ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించింది. ‘వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రయాణికులు కూడా కరోనా బారిన పడొచ్చు. కొత్త రకం వేరియంట్ల బారిన పడి వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్‌‌కు ప్రయాణాలను మానుకోవాలి. ఒకవేళ తప్పనసరిగా ఇండియాకు వెళ్లాలనుకుంటే మాత్రం ప్రయాణానికి ముందు టీకా వేయించుకొని వెళ్లండి’ అని యూఎస్‌‌లోని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ అడ్వయిజరీలో స్పష్టం చేసింది.