దేశంలోకి చొరబడినందుకు రెండేండ్లు జైలు శిక్ష

దేశంలోకి చొరబడినందుకు రెండేండ్లు జైలు శిక్ష

మహారాజ్ గంజ్: భారత్​లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన అమెరికన్ పౌరుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20వేలు ఫైన్​ చెల్లించాలని ఆదేశించింది.  చీఫ్​ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సౌరభ్ శ్రీవాస్తవ శుక్రవారం ఈ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అమెరికన్ పౌరుడు ఎరిక్ డేనియల్ బెక్ విత్ (36) నకిలీ వీసాతో నేపాల్ సరిహద్దు గుండా ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి డాక్యుమెంట్లను పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో మార్చి 29న అతడిని అరెస్టు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఫారినర్స్ యాక్ట్ లోని సెక్షన్ 14 కింద కేసును నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేల ఫైన్​ విధించింది.