కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక స్పృహ కోల్పోయిన నర్సు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక స్పృహ కోల్పోయిన నర్సు

టెనెస్సే: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సురక్షిత వ్యాక్సిన్‌‌నే అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు సమయం పట్టినా సరేనని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రజుల మొసళ్లలాగా మారినా కంపెనీలు పట్టించుకోవని బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని పక్కనబెడితే.. బ్రిటన్‌‌తోపాటు అమెరికా లాంటి పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. యూఎస్‌‌లోని టెనెస్సేలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకా తీసుకున్న ఓ నర్సు స్పృహ తప్పడం చర్చనీయాంశమైంది.

ఫైజర్-బయోఎన్‌‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న సదరు నర్సు పేరు టిఫనీ డోవర్. టీకా తీసుకున్నాక ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొన్న డోవర్ తల నొప్పి రావడంతో కింద పడిపోయింది. మూర్ఛపోవడానికి ముందు తనకు తల తిరిగినట్లుగా ఉందని పేర్కొంది. డోవర్ పడిపోగానే అక్కడి డాక్టర్లు ఆమెకు ట్రీట్‌‌మెంట్ అందించారు. అనంతరం ఆమె కోలుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. వ్యాక్సినేషన్ ప్రారంభ దశలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో అని కామెంట్లు చేస్తున్నారు.