తెలంగాణలో అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ తయారీ..ప్రముఖ విదేశీ సంస్థల తయారీ యూనిట్లు ఇక్కడున్నయ్: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ తయారీ..ప్రముఖ విదేశీ సంస్థల తయారీ యూనిట్లు ఇక్కడున్నయ్: మంత్రి ఉత్తమ్
  • విమానాల విడిభాగాలకు ‘మేడిన్​ తెలంగాణ’ ట్యాగ్​
  • సాఫ్రాన్​, బోయింగ్, లాక్​హీడ్​ మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి సంస్థల ప్లాంట్లతో గ్లోబల్​ గుర్తింపు
  • డీఆర్డీవోలాంటి సంస్థలతో ఏరోస్పేస్​, డిఫెన్స్​ తయారీకి హైదరాబాద్​ అత్యంత అనుకూలమని వెల్లడి
  • ‘ఏరోమార్ట్​ హైదరాబాద్​ 2026’ సదస్సులో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు:  అంతర్జాతీయ ఏరోస్పేస్​ దిగ్గజ సంస్థలు.. తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాలని ఇరిగేషన్​, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. . అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్​ క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రంలోని టాటా సకోర్స్కీ ఏరోస్పేస్​ తయారు చేస్తున్నదని తెలిపారు.  ప్రపంచస్థాయి మౌలిక వసతులు, విధానపరమైన మద్దతు, ప్రతిభ కలిగిన యువత, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలనతో తెలంగాణ ఏరోస్పేస్​ మాన్యుఫ్యాక్చరింగ్​ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని చెప్పారు.

భవిష్యత్​ ఏరోస్పేస్​ ఉత్పత్తులన్నీ తెలంగాణ నుంచే వస్తాయని తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘ఏరోమార్ట్​ హైదరాబాద్​ 2026’ ఏరోస్పేస్​ అండ్​ డిఫెన్స్​ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు 25 దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి​ మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే వరంగల్​, ఆదిలాబాద్​, కొత్తగూడెంలలో 3 కొత్త ఎయిర్​పోర్టులను నిర్మిస్తామని తెలిపారు. ఏరోస్పేస్​మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండున్నరేండ్లుగా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించి గ్లోబల్​హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించిందని చెప్పారు.

అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​, స్పెయిన్​, ఇటలీ, జపాన్​, ఇజ్రాయెల్, కెనడాలాంటి దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తు చేశారు. అపాచీ హెలికాప్టర్ల ఫ్యూజ్​లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బోయింగ్​, ఎఫ్​16 యుద్ధవిమానాల రెక్కలను లాక్​హీడ్​ మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. సాఫ్రాన్​ సంస్థ కాంప్లెక్స్​ ఏరో ఇంజిన్​ కాంపోనెంట్స్​, ఎమ్మార్వో సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్​ చేస్తున్నదని వివరించారు. జీఈ ఏరోస్పేస్​, హనీవెల్​ సంస్థలు కూడా ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు.

ప్రపంచంలోని అత్యాధునికమైన విమానాల్లోని విడిభాగాలు ఇప్పుడు మేడిన్​ తెలంగాణ ట్యాగ్​తో తయారవుతున్నాయని తెలిపారు.  గత నెలలోనే స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐటీపీ ఏరో సంస్థ.. మాన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీఎంఆర్​ ఏరోస్పేస్​ పార్కులో కేవలం ఎఫ్​టీజీ ఏరోస్పేస్​ అనే సంస్థనే మాన్యుఫ్యాక్చరింగ్​ స్టార్ట్​ చేసిందని తెలిపారు.  

ఏరోస్పేస్​ ఎకనామిక్​ జోన్​

రాష్ట్రంలో ఏరోస్పేస్​ కోసం ప్రత్యేకంగా స్పెషల్​ ఎకనామిక్​ జోన్​ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజెడ్​)ను ఏర్పాటు చేసి పటిష్టమైన ఏరోస్పేస్​ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలపేతం చేశామని మంత్రి ఉత్తమ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్​, డిఫెన్స్​, స్పేస్​ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1500 ఎంఎస్ఎంఈలు కాంపోనెంట్లను తయారుచేసి ఇస్తున్నాయన్నారు. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డీఆర్డీడీవో, డిఫెన్స్​ పబ్లిక్​ సెక్టార్​ కంపెనీలు, రీసెర్చ్​ సంస్థలు, ప్రైవేట్​ ఇండస్ట్రీలతో హైదరాబాద్​ ఏరోస్పేస్​, డిఫెన్స్​ సెక్టార్ల మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారిందని చెప్పారు.

దాంతోపాటే రాష్ట్రంలో అత్యంత నైపుణ్యం కలిగిన యువతకూ కొదవలేదన్నారు. యంగ్​ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్​ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతో ప్రతిభ కలిగిన యువత ఎంతో మంది వస్తున్నారని చెప్పారు. దీంతో గత కొన్నేండ్ల నుంచి ఏరోస్పేస్​, డిఫెన్స్​ ఇండస్ట్రీ వృద్ధి 30 శాతంగా ఉందని తెలిపారు. నిరుడు తొలిసారిగా ఫార్మా ఎగుమతులను దాటి అధికంగా ఏరోస్పేస్​ ఎగుమతులే ఎక్కువగా జరిగాయన్నారు. 103 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే మూడు కొత్త ఎయిర్​పోర్టులతో మెయింటెనెన్స్​, రిపేర్​, ఓవర్​హాల్​ (ఎంఆర్​వో) ఆపరేషన్లలో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.