
ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను తనకు నోబుల్ శాంత్ బహుమతి ఇవ్వాలంటున్న ట్రంప్ మరోపక్క వెనెజువలాపై బాంబుల వర్షం కురిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. వెనిజులా యుద్ధ విమానాలు అమెరికా సేనలకు ఏదైనా ప్రమాదాన్ని కలిగిస్తే వెంటనే వాటిని కూల్చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పటికే అమెరికా తన ఎఫ్-35 జెట్స్ తో పాటు నేవీ షిప్స్ కరేబియన్ దీవుల్లోని ప్యూర్టో రికోకు పంపింది అమెరికా.
వెనిజులా నుంచి డ్రగ్స్ అమెరికాకు అక్రమంగా వస్తున్నాయంటూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ట్రంప్ ఒత్తిడిని పెంచుతున్నారు. ఈ క్రమంలో సౌత్ కరేబియన్ ప్రాంతంలో ఉన్న యుద్ధనౌకలకు అమెరికా 10 ఎఫ్-35 విమానాలను కూడా పంపించింది. డ్రగ్స్ ముఠాలకు వెనిజులా నాయకుడు సహకరిస్తున్నారంటా యూఎస్ ఆరోపిస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. గురువారం వెనిజులాకు చెందిన రెండు జెట్స్ తమ నేవీ నౌకల దగ్గర రెచ్చగొచ్చే చర్యలకు పాల్పడ్డాయంటూ ట్రంప్ సర్కార్ ప్రకటించిన తర్వాత పరిస్థితులు ముదురుతున్నాయి.
ఈవారం ప్రారంభంలో యూఎస్ సాయుధదళాలు కరేబియన్‌లో ఒక మాదకద్రవ్య పడవను పేల్చివేశాక ట్రంప్ మదిరోపై తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్ ముఠాలకు మదిరో నాయకత్వం వహిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పడవలో ప్రయాణిస్తున్న11 మంది నేరగాళ్లను చంపిన తర్వాత దాదాపు 30 లక్షల జనాభా కలిగిన కరేబియన్ ద్వీప భూభాగమైన ప్యూర్టో రికోలోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌కు అమెరికా తన హైటెక్ F-35 జెట్‌లను పంపించింది.
ప్రస్తుతం వెనిజులా దగ్గర 1980లలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన 15 F-16 ఫైటర్ జెట్‌లు, అనేక రష్యన్ ఫైటర్లు, హెలికాప్టర్లు ఉన్నాయి. మరోపక్క అమెరికా దుందుడుకు చర్యలు వెనిజులా క్రూడ్ నిల్వలను హరించటానికే అంటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.