ఇండియా, పాక్ గొడవల్లో తలదూర్చబోం

ఇండియా, పాక్ గొడవల్లో తలదూర్చబోం

వాషింగ్టన్: భారత్- పాకిస్తాన్ మధ్య నెల కొన్న వివాదాలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది. శాంతికి విఘాతం కలిగిం చేందుకు ప్రయత్నించే టెర్రరిస్టులను వాళ్ల ఇండ్లల్లోకి చొరబడి మరీ హతమార్చేం దుకు కూడా భారత్ వెనకాడదని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సిం గ్ ఇటీవల చేసిన హెచ్చరికలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం స్పందించారు.

“భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాలపై, ఉద్రిక్తతలపై అమెరికా జోక్యం చేసుకోదు.  కానీ, ఉద్రిక్తతల నివారణకు ఆ రెండు దేశా లు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాల ని సూచిస్తున్నాం" అని పేర్కొన్నారు.