మార్చి1 నుంచి ‘హెచ్1బీ’ రిజిస్ట్రేషన్

మార్చి1 నుంచి ‘హెచ్1బీ’ రిజిస్ట్రేషన్

    ఎలక్ట్రానిక్ విధానంపై పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్

    ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్స్

హెచ్1 బీ వీసాల జారీ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమెరికా ప్రకటించింది. 2021 క్యాప్ సీజన్ కు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, 10 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తామని యూఎస్ సిటిజన్ షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) ఆఫీసర్లు చెప్పారు. హెచ్ 1 బీ వీసాల కోసం ఫారిన్ వర్కర్ల తరపున కంపెనీలు లేదా ఆ సంస్థల ప్రతినిధులు అప్లయ్ చేయాల్సి ఉంటుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్ 1 బీ ఆధారంగానే యూఎస్ కంపెనీలు ఇండియా, చైనా లాంటి దేశాలకు చెందిన ఉద్యోగులను హైర్ చేసుకుంటాయి.

“కొత్త ప్రాసెస్ ప్రకారం ఎంప్లాయర్స్ లేదా వారి ప్రతినిధులు తమ ఉద్యోగుల కోసం హెచ్ 1 బీ వీసా దరఖాస్తు చేయవచ్చు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ర్యాండమ్ గా ఎంపికైనవారు హెచ్ 1 బీ వీసాలు అర్హులవుతారు. వారు మాత్రమే పూర్తిస్థాయి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది” అని యూఎస్ సీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ మార్క్ కౌమాన్స్ చెప్పారు. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వల్ల పేపర్ వర్క్ , డేటా ఎక్స్చేంజ్ తగ్గిందని, దరఖాస్తు చేసుకునేవారికి ఖర్చు తగ్గినట్లు తెలిపారు. ఉద్యోగి, కంపెనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందన్నారు. కొత్త సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ స్ట్రీమ్ లైన్ అవుతుందని, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలు, ఇన్ స్ట్రక్షన్స్  లు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా వెబ్ సైట్ లో  పెట్టినట్లు తెలిపారు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కు  65 వేల హెచ్ 1 బీ వీసాలను మాత్రమే అమెరికా జారీ చేస్తోంది.