పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలు తగ్గించేలా చర్యలు తీసుకోండి: ట్రంప్‌‌‌‌కు అమెరికా సెనేటర్ల విజ్ఞప్తి

పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలు తగ్గించేలా చర్యలు తీసుకోండి: ట్రంప్‌‌‌‌కు అమెరికా సెనేటర్ల విజ్ఞప్తి

వాషింగ్టన్: భారత్– అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా పప్పుధాన్యాలపై భారత్ విధించిన 30% సుంకాలను తగ్గించేలా చూడాలని ప్రెసిడెంట్ ట్రంప్‎కు అమెరికా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు జనవరి16న ట్రంప్‎కు మోంటానాకు చెందిన సెనేటర్ స్టీవ్ డైన్స్, నార్త్ డకోటాకు చెందిన కెవిన్ క్రామెర్ లెటర్ రాశారు. 

ఈ లేఖ ప్రకారం.. "మోంటానా, నార్త్ డకోటా రాష్ట్రాల్లో పప్పుధాన్యాలు, ముఖ్యంగా పీస్(బట్టాణి) ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ పంటలకు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు. ప్రపంచ పప్పు ధాన్యాల వినియోగంలో భారత్ వాటా దాదాపు 27%..  లెంటిల్స్, చిక్‌‌‌‌పీస్, డ్రైడ్ బీన్స్, పీస్ వంటి పప్పుధాన్యాలు ఇండియన్లు సాధారణంగా వినియోగిస్తారు. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 

అయితే, ఇప్పుడు ఈ ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోంది. గతేడాది అక్టోబర్ 30న యూఎస్ నుంచి దిగుమతి అయ్యే యెల్లో పీస్‌‌‌‌పై భారత్ 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ సుంకాల వల్ల అమెరికా పప్పుధాన్యాల ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పప్పుధాన్యాల సుంకాలపై వెంటనే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోండి" అని ట్రంప్​కు సెనేటర్లు సూచించారు.