2023లో అదనంగా 64,716 హెచ్2బీ వీసాలు

2023లో అదనంగా 64,716 హెచ్2బీ వీసాలు

వాషింగ్టన్: అమెరికాలో వ్యవసాయేతర రంగాల్లో వర్కర్లుగా పని చేసే విదేశీయుల కోసం 2023 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 64,716 హెచ్ 2బీ వీసాలను జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్​షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. తొలిసారిగా అన్ స్కిల్డ్ ఫారిన్ వర్కర్ల కోసం ఈ మేరకు టెంపరరీగా అదనపు వీసాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. పీక్ సీజన్ లో అమెరికన్ కంపెనీల లేబర్ అవసరాలు తీరేందుకు వీలుగా ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది.

అయితే, అన్ స్కిల్డ్ వర్కర్ల విభాగంలోకి వచ్చే హెచ్ 2బీ వీసాల పట్ల  ఇండియన్ లు పెద్దగా ఆసక్తి చూపించరు. అత్యధిక మంది ఇండియన్ లు హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ గా హెచ్ 1బీ వీసాలతో మాత్రమే అమెరికాకు వెళ్తుంటారు. అందుకే ఈ అదనపు వీసాలతో ఇండియన్ లకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని చెప్తున్నారు.