ఆయుధాలు నిషేధించాలి

ఆయుధాలు నిషేధించాలి

యూఎస్‌‌లో రెండు విషాద ఘటనల అనంతరం యూఎస్ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఇటీవలే అమెరికా టెక్సాస్ లో ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాకీతో కాల్పులు జరిపి 19 మంది చిన్నారులతో సహా మొత్తం 21 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అంతకుముందు న్యూయార్క్‌‌లోని ఓ సూపర్ మార్కెట్‌‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 86 సంవత్సరాలున్న రూత్ విట్ ఫీల్డ్ (Ruth Whitfield) అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కమలా హారిస్ హాజరయ్యారు. అనంతరం అక్కడున్న వారినుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. తుపాకీ హింస జరగడం దారుణమని, దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పౌర సమాజంలో దీనికి చోటు లేదని తెలిపారు. 

అంతకుముందు అతను హింసాత్మక నేరానికి పాల్పడ్డారా ? ఈ క్రమంలో ఆయుధాల నిషేధాన్ని విధించాలన్నారు. పాఠశాలలో కాల్పులకు దిగిన నిందితుడు సెమీ ఆటోమెటిక్ రైఫిల్స్ ను కలిగి ఉన్నాడని తేలింది. పుట్టిన రోజు తర్వాత వెంటనే కొనుగోలు చేసినట్లు నివేదించినట్లు తెలుస్తోంది. పోలీసులు కాల్చి చంపిన తర్వాత.. 1,657 రౌండ్ల మందుగుండు సామాగ్రీ, 60 మ్యాగజైన్ లను కనుగొన్నారు. ఈ ఘటనల అనంతరం ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. గన్ కల్చర్ ను నియంత్రించడానికి ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా వ్యాఖ్యానించారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరిన్ని వార్తల కోసం : -

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు


వరదల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు