ఫోన్​ నెంబర్​ బదులు యూజర్​ నేమ్

ఫోన్​ నెంబర్​ బదులు యూజర్​ నేమ్

యూజర్లు ఇకపై తమ ఖాతాలకు యూజర్​ నేమ్​లు పెట్టుకునే ఫెసిలిటీ తీసుకురాబోతోంది. ఇప్పుడు ఈ ఫీచర్​ను వాట్సాప్​ డెవలప్​ చేస్తోందని, ఫ్యూచర్​లో తీసుకొచ్చే ఛాన్స్ ఉందని వాబీటా ఇన్ఫో వెబ్​సైట్​ పేర్కొంది. వాట్సాప్​ ప్రొఫైల్​లోకి వెళ్తే ప్రొఫైల్ పిక్చర్, అబౌట్, ఫోన్​ నంబర్ కనిపిస్తాయి. అయితే, వాటితోపాటు యూజర్ నేమ్​ కూడా యాడ్ చేస్తారట. దాన్ని యూజర్లే క్రియేట్​ చేసుకోవచ్చు. 

‘@’ సింబల్​తో మొదలయ్యే ఈ యూజర్​నేమ్​ను నచ్చింది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా వాట్సాప్​ యూజర్​తో చాట్ చేయాలంటే ఫోన్​ నెంబర్ బదులు వాట్సాప్ యూజర్ ఐడీ ఇవ్వొచ్చు. ఇంకా దీని గురించి మరిన్ని వివరాల కోసం కొంత సమయం వేచి చూడాల్సిందే.