ఉస్తాద్..ఆయుధపూజ

ఉస్తాద్..ఆయుధపూజ

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల హీరోయిన్‌‌. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌‌తో ఆకట్టుకున్న మేకర్స్.. దసరా సందర్భంగా విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.

ఖాకీ కాస్ట్యూమ్స్‌‌లో పవర్‌‌‌‌ఫుల్‌‌గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్.. నెత్తుటి మరకలతో ఉన్న పెద్ద సుత్తిని పట్టుకుని నడుస్తున్నాడు. భారీ యాక్షన్‌‌ సీన్‌‌కు సంబంధించిన స్టిల్ ఇదని అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.