Usure Trailer: ప్రేమికుల ‘ఉసురే’.. యథార్థ సంఘటనలతో గ్రామీణ ప్రేమకథ

Usure Trailer: ప్రేమికుల ‘ఉసురే’.. యథార్థ సంఘటనలతో గ్రామీణ ప్రేమకథ

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గ్రామీణ ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ఉసురే’. టీజే అరుణాచలం, జననై కునశీలన్‌‌‌‌ జంటగా నవీన్‌‌‌‌ డి గోపాల్‌‌‌‌ దర్శకత్వంలో మౌళి ఎం రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆగస్టు 1న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఓ ప్రేమజంటను విడదీయడానికి వాళ్ల కుటుంబ సభ్యులు ఏం చేశారనేది చూపిస్తూ ఆసక్తిరేపేలా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను కట్ చేశారు. ఇందులో నిన్నటితరం హీరోయిన్‌‌‌‌ రాశి కీలక పాత్రలో కనిపించారు.

హీరోయిన్‌‌‌‌కు అమ్మగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటించినట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, వారి లుక్స్ గ్రామీణ వాతావరణంలోని విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ అని ఎంతో రియలిస్టిక్‌‌‌‌గా  ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు.