ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి : యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ సత్యానంద్

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి :  యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ సత్యానంద్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో పాటు,  రిటైర్డ్​ఉద్యోగుల పెన్షన్, బెనిఫిన్స్​ను రిలీజ్​ చేయాలని యూటీఎఫ్​ స్టేట్ సెక్రటరీ సత్యానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన యూటీఎఫ్​ జిల్లాస్థాయి  మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గతంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం డీఏ, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రిటైర్డ్​ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా ప్రెసిడెంట్ 

ఆకుల బాబు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. 20 ఏండ్ల పాటు టీచర్​గా పని చేసిన వారికి టెట్ నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ సాయిలు, స్టేట్ కో ఆర్డినేటర్ ఎమీలియా,  ప్రతినిధులు రూప్​సింగ్,  నారాయణ, బాలయ్య, సాయిగౌతమ్,  నాపంల్లి, ఏసురత్నం, రాజ, రాజయ్య, సురేష్ తదితరులు  పాల్గొన్నారు.