హైస్కూళ్ల బలోపేతానికి ఐక్య పోరాటం చేయాలి : యూటీఎఫ్‌‌‌‌

హైస్కూళ్ల బలోపేతానికి ఐక్య పోరాటం చేయాలి : యూటీఎఫ్‌‌‌‌
  • హెచ్‌‌‌‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హైస్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు, హెడ్‌‌‌‌మాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గెజిటెడ్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎంలు ఐక్యంగా పోరాడాలని యూటీఎఫ్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. మంగళవారం యూటీఎఫ్‌‌‌‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన హెడ్‌‌‌‌మాస్టర్ల వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌లో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి, హెచ్‌‌‌‌ఎంలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

ప్రతి జిల్లాకు డీఈవో, డివిజన్‌‌‌‌కు డిప్యూటీ డీఈవో, మండలానికి ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ప్రతి పాఠశాలకు కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ను నియమించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శులు రవికుమార్‌‌‌‌, రంజిత్‌‌‌‌కుమార్‌‌‌‌, వెంకటప్ప, శారదతో పాటు హెచ్‌‌‌‌ఎంల ప్రతినిధులు పాల్గొన్నారు.