- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్నిర్లక్ష్యంతో రిమ్స్లో పసికందుల ప్రాణాలు పోతే.. ఎలుకల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. నవజాత శిశువుల వార్డులో ఎలుకలు తిరగడమే దారుణమంటే.. ఆ ఎలుకలు ఏసీ వైర్లు కొరకడం వల్లే అగ్నిప్రమాదం సంభవించింది అనడం ఇంకా సిగ్గుచేటని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే ఐదుగురు శిశువులు చనిపోయారని స్పష్టంగా తెలుస్తున్నా... ఇలాంటి పనికమాలిన నివేదికలు ఇచ్చి ఎవర్ని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి ఈ దొంగ రిపోర్టులు అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి తన సొంత ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదని, అందుకే కనీస నిర్వహణ, పర్యవేక్షణ లేక ఆసుపత్రులు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు.
