ఉత్తుత్త హీరోలు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

ఉత్తుత్త హీరోలు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

కమెడియన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ విఠా హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉత్తుత్త హీరోలు’. కామెడీ, సస్పెన్స్ ప్రధాన అంశాలుగా రాయలసీమ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను ఇటీవల విడుదల చేశారు. మోసం చేసి పారిపోతున్న నలుగురు కుర్రాళ్ల చేతిలో నుంచి బ్యాగు జారి, అందులోని డబ్బు, నగలు గాల్లో ఎగురుతున్నట్టుగా ఈ పోస్టర్‌‌‌‌ను డిజైన్ చేశారు. ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ అల్లుకున్న కథ ఇదని, కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రవీణ సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వణం, హర శ్రీనివాస్, భరత్ బెహరా, మనీష్ విశాల్ తాడిమర్రి, షిన్నింగ్ ఫణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.