రిహార్సల్ ఆఫ్ ఉత్సవం

రిహార్సల్ ఆఫ్ ఉత్సవం

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో  సురేష్‌‌‌‌ పాటిల్‌‌‌‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిప‌‌‌‌బ్లిక్ డే సంద‌‌‌‌ర్భంగా ఈ సినిమా ఫ‌‌‌‌స్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ని విడుద‌‌‌‌ల చేశారు మేక‌‌‌‌ర్స్. లీడ్ రోల్  పోషిస్తున్న దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు. 

తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు ఉన్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ‘ది షో మస్ట్ గో ఆన్’  అనే క్యాప్షన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌పై రాసుండటం ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే  ‘ది రిహార్సల్ ఆఫ్ 'ఉత్సవం' అంటూ జనవరి 28న ఉదయం 11:34కి టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.