మ్యారేజెస్ మేడిన్ హెవెన్

మ్యారేజెస్ మేడిన్ హెవెన్

రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాష్  లీడ్ రోల్స్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అనే సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ ఆకట్టుకునే లిరిక్స్ రాయగా, ఆర్మాన్ మాలిక్ పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది.

‘ఓ సరే సరే నువ్వు ఏ లోకాన వున్నా.. ఓ సరే సరే నేను ఏ లోకాన వున్నా.. ఒకరికి ఒకరం  నేడు చూడకుండా వున్నా సరే.. నువ్వు నేను జంటై తీరుతామే కాలం ఆపినా సరే..’ అంటూ సాగిన పాటలో రెజీనా, దిలీప్ పెళ్లి వస్త్రాల్లో  కనిపిస్తున్నారు.  మ్యారేజ్ వైబ్‌‌‌‌తో ఆర్కెస్ట్రా  రైజేషన్‌‌‌‌తో టైటిల్‌‌‌‌కి తగ్గటే సాగిన పాట ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.