మునుగోడులో డబ్బు, మద్యం, బంగారం పంపిణీపై ఎంపీ ఉత్తమ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ 

మునుగోడులో డబ్బు, మద్యం, బంగారం పంపిణీపై ఎంపీ ఉత్తమ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై పోల్‌‌‌‌లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీలు మద్యం, డబ్బు, బంగారం, అధికార బలంతో ఓటర్లను కొనాలని చూస్తున్నాయని కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇలా చేసే బదులు ఎలక్షన్ లేకుండా, వేలం పెట్టి ఓట్లను కొనుక్కోండని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌లో ఉత్తమ్, భట్టి విక్రమార్క, పాల్వాయి స్రవంతి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డిని డబ్బులు ఇవ్వాలని నిలదీసిన వీడియోను మీడియాకు చూపించారు. రూ.12 లక్షలు ఇస్తానని చెప్పి, రూ.2 లక్షలు ఎట్లా ఇస్తరని, మిగతా రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రజలు మంత్రిని నిలదీశారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దోచుకున్న సొమ్మును మునుగోడులో, దేశంలో దోచుకున్న సొమ్మును బీజేపీ ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులని, జాగ్రత్తగా ఆలోచించి, కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలని కోరారు. కాగా, ఏఐసీసీ ప్రెసిడెంట్‌‌‌‌గా ఎవరు గెలిచినా పార్టీ బలపడుతుందన్నారు. 

ఓట్లు కొనాలని చూస్తున్నరు: భట్టి విక్రమార్క

అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లు మునుగోడులో ఓట్లు కొనాలని చూస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎమ్మెల్యే, మంత్రులు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పకుండా ఓటర్లకు పైసలు, బంగారం ఇస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తామని చెబుతున్న, ఇచ్చిన నాయకులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రజలను ప్రలోభపెడుతున్నరు: పాల్వాయి స్రవంతి

మునుగోడులో బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లు ప్రజలను ప్రలోభపెడుతున్నాయని మునుగోడు కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను కూడా కొంటున్నారని, కొనలేని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి మహిళా అభ్యర్థి అయిన తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.