
తెలంగాణలో ఇండియన్ పోలీస్ సర్వీస్ లేదనీ.. కల్వకుంట్ల పోలీసు సర్వీస్ పనిచేస్తోందని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఏమి చెబితే అదే పోలీసులు చేస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలతో హైదరాబాద్ లో భయానక వాతావరణం సృష్టించారనీ.. ఇందుకు పోలీసులు స్వయంగా సహకారాన్ని అందించారన్నారు.
శనివారం జాతీయ కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీకి మాత్రం అనుమతివ్వడం లేదని విమర్శించారు. రేపు 11 గంటలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.