
విదేశీ కుట్రతో క్లౌడ్ బరెస్ట్ అనేది సిల్లీ కామెంట్ అన్నారు నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని సీఎం కేసీఆర్ చూశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది కాబట్టే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ క్లౌడ్ బరెస్టు అన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదని... కుట్రలతో క్లౌడ్ బరస్ట్ అనేది సాధ్యం కాదన్నారు ఉత్తమ్. అటు భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్... దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందని, ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.