తెలంగాణలో ముందస్తు ఖాయం

తెలంగాణలో ముందస్తు ఖాయం

తెలంగాణలో ముందస్తు ఖాయమన్నారు కాంగ్రెస్  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి నన్ను గెలిపించారని తెలిపారు. స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం వారసులమన్నారు.  ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్ పార్టీ నిలబెడితే..మరోవైపు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించారని విమర్శించారు. సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టపోయినా లెక్కచేయకుండా సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు.

మతపరంగా విభజించి మోడీ, మోసాలతో కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు ఉత్తమ్. అన్ని రకాలుగా మోసం చేసిన కేసిర్, ఇప్పుడు దళిత బంధు అంటూ మోసం చేస్తున్నాడన్నారు. దళితబంధుకు 1 లక్ష 70 వేల కోట్లు కావాలి.. కానీ కేసీఆర్ 25 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏక కాలంలో రుణమాఫీ చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందని, టీఆర్ఎస్ రుణమాఫీ వడ్డీకి సరిపోవని విమర్శించారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన గుత్తా, కేసీఆర్ కాళేశ్వరానికి అన్ని నిధులు ఖర్చు చేసి పూర్తి చేస్తే, కేవలం 3వేల కోట్లు ఎస్సెల్బీసీకి విడుదల చేయించి పూర్తి చేయలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్.

 

మరిన్ని వార్తల కోసం...

అతడు వన్డేలకు పనికి రాడు