అతడు వన్డేలకు పనికి రాడు

అతడు వన్డేలకు పనికి రాడు

న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ పై వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్ వన్డేలకు పనికిరాడని.. అతడ్ని టీ20 జట్టులో ఉంచితే చాలని గంభీర్ అన్నాడు. వన్డే క్రికెట్ కు కావాల్సినంత పరిణతి అయ్యర్ లో లేదన్నాడు. 

'వెంకటేశ్ అయ్యర్ ను టీ20 క్రికెట్ కు మాత్రమే పరిగణించాలనేది నా అభిప్రాయం. వన్డే క్రికెట్ ఆడేందుకు అవసరమైన మెచ్యూరిటీ అతడిలో లోపించింది. కేవలం v7 నుంచి 8 ఐపీఎల్ మ్యాచుల్లో పెర్ఫార్మెన్స్ చూసి అతడికి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే ఛాన్స్ ఇచ్చారు. ఐపీఎల్ ఆటతీరును బట్టి అతడికి పొట్టి ఫార్మాట్ లో అవకాశం ఇవ్వొచ్చు. కానీ వన్డే అనేది పూర్తిగా వైవిధ్యమైన ఫార్మాట్. ఇందులో రాణించడం అంత సులువేం కాదు' అని గంభీర్ అన్నాడు. 

'అయ్యర్ ఐపీఎల్ లో ఓపెనింగ్ పొజిషన్ లో ఆడాడు. కానీ టీమిండియా అతడ్ని వన్డేల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తోంది. అతడ్ని వెనక్కి పంపాలి. వన్డేలకు పనికొస్తాడని భావిస్తే.. అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైజీతో అతడ్ని మిడిల్ ఆర్డర్ లో ఆడించమని చెప్పాలి. అయ్యర్ ను భారత టీ20 జట్టులో ఉంచితే చాలు. అది కూడా అతడ్ని ఓపెనింగ్ లో దింపాలి' అని గంభీర్ సూచించాడు.

మరిన్ని వార్తల కోసం..

317జీవో ఎఫెక్ట్: మరో ఉపాధ్యాయుడు బలి

కరోనా నెగెటివ్ రిపోర్ట్/వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే అలిపిరి నుంచే వెనక్కి

హైదరాబాదీ పిల్లాడికి ప్రధాన మంత్రి బాల పురస్కారం