గ్రామ పంచాయతీలను ప్రభుత్వం లూటీ చేసింది

గ్రామ పంచాయతీలను ప్రభుత్వం లూటీ చేసింది

టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని.. గ్రామ పంచాయతీ లను ప్రభుత్వం లూటీ చేస్తోందన్నారు కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ట్రాక్టర్ లను, ఎల్.ఈ. డి లైట్లను వాళ్లు చెప్పిన ఏజెన్సీ ల నుంచే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టి కమీషన్లు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని.. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన దుర్మార్గపు చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారుు. సర్పంచ్ లకు బిల్లులు ఎప్పుడు పెండింగ్ లొనే ఉంటున్నాయని.. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు.. మండలాలు, జిల్లా పరిషత్ లు పూర్తి అధ్వాన్నంగా మారిపోయాయన్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయం.. కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో పడిపోతుందో రాబోయే రోజుల్లో మనమే చూస్తామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు వ్యాపారాలుగా మారిపోయాయని ఆయన ఆరోపించారు.

మండలాలు, జిల్లా పరిషత్ లు పూర్తి అధ్వాన్నంగా మారిపోయాయన్నారు. పంచాయితీ ల సమస్యలపై ప్రజా ప్రతినిధులకు సంఘీభావం గా ఉద్యమం చేద్దాం.. గవర్నర్ కు వినతి పత్రం అందించి సమస్యలను ఫోకస్ చేద్దామని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. రాజీవ్ గాంధీ హయాంలో పంచాయతీ వ్యవస్థ బలపడింది… అధికార విస్తరణ, నిధుల పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేద్దాంమని.. స్థానిక సంస్థల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి లో అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని.. తెలంగాణ లో ప్రతి పల్లె లో కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది.. ఇంత పెద్ద పార్టీ తెలంగాణ లోనే లేదన్నారు. సర్పంచ్ లకు, స్థానిక నాయకులకు అండగా ఉంటాం. వారు భయ పడాల్సిన అవసరం లేదు. సర్పంచులతో, గ్రామ నాయకులతో సమావేశాలు పెట్టి వారికి భరోసా ఇద్దాం.. నెలకు రెండు మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అంశాల వారీగా చర్చించుకోవాలన్నారు.  కాంగ్రెస్ సిద్ధాంతాలు, గ్రామ సమస్యలు వాటి పరిష్కారాలు, పార్టీ బలోపేతం పైన చర్చించుకోవాలి..కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మనం గ్రామాల్లో బలంగా అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతిలో న్యాయం ఉంటుంది. మనం శ్రమ చేసి, ప్రజల్లో ఉంటే.. ఎవరు ఏమి అన్యాయాలు చేసినా మనం అధికారంలోకి వస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నేతలు సమస్యల పరిష్కారం లో కాంగ్రెస్ నిరంతరం ముందుండి పని చేయాలని ఆయన కోరారు.