హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అయితది

హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అయితది

ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు స్వస్తి చెప్పేందుకు ఓ పాఠశాల విద్యార్థి హైటెక్ వ్యవస్థకు రూపొందించాడు. సీతాపూర్ కి చెందిన అరుణ్ కుమార్ అనే పదో తరగతి విద్యార్థి హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ నడిచేలా పరికరాన్ని తయారు చేశాడు. అంటే హెల్మెట్ లేకుండా బైక్ కనీసం స్టార్ట్ కూడా కాకుండా తయారు చేశాడు.  హెల్మెట్ తలపై పెట్టుకున్న తర్వాతే దానికి అమర్చిన పరికరం యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాతే బైక్ స్టార్ట్ అవుతుంది. ఈ విద్యార్థి తయారు చేసిన ఈ కొత్త టెక్నిక్‌ని చూసి స్కూల్ టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.  

సూపర్ టెక్నిక్

నగరంలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుతున్న ఇంద్రౌళి నివాసి దినేష్ కుమార్ కుమారుడు 10వ తరగతి విద్యార్థి అరుణ్ కుమార్ ఈ టెక్నిక్‌ను ఆవిష్కరించాడు. సెన్సార్‌లతో హెల్మెట్‌ను తయారు చేయడానికి రెండు వైర్‌లెస్ పరికరాలను ఉపయోగించినట్లు విద్యార్థి చెప్పాడు. దీని ఖరీదు దాదాపు రూ.400 గా నిర్ణయివచ్చింది ఆ విద్యార్థి.. హెల్మెట్‌ని వైర్‌లెస్ కంట్రోలర్‌కి అమర్చామని చెప్పాడు. ఈ పరికరం వాహనం యొక్క ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుందని, 9 వోల్టేజ్ బ్యాటరీతో పని చేస్తుందని అరుణ్ స్పష్టం చేశాడు.

ఉపాధ్యాయుల ప్రశంసలు 

హెల్మెట్ లోపల పుష్ బటన్ ఉందని, అది ధరించిన తర్వాత పుష్ బటన్‌లో కరెంట్ వస్తుందని, పరికరం యాక్టివేట్ అయిన వెంటనే బైక్ స్టార్ట్ అవుతుందని అరుణ్ కుమార్ చెప్పారు. ఈ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటంటే.. బైక్‌ను తలపై నుంచి తీయగానే ఆటోమేటిక్‌గా ఆగిపోతుందని, దాన్ని ధరించి బైక్‌ను స్టార్ట్ చేయవచ్చన్నాడు. ఈ డివైజ్‌ని తయారు చేసేందుకు యూట్యూబ్ సహాయం తీసుకున్నానని అరుణ్ చెప్పాడు. ఈ ఆవిష్కరణతో అరుణ్ ఉపాధ్యాయుల ప్రశంసలందుకున్నాడు.

కాలేజీ ఎగ్జిబిషన్‌లో...

విద్యార్థి అరుణ్ కాలేజీ ఎగ్జిబిషన్‌లో ఈ పరికరాన్ని ప్రదర్శించాడు. దీంతో రవాణా శాఖ అధికారులు ఆయనను అభినందించారు.  అంతేకాదు రాష్ట్ర స్థాయిలో ఈ పరికరం ద్వారా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సెన్సార్‌తో కూడిన హెల్మెట్‌ను మరిన్ని వాహనాల కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశపెడితే ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టవచ్చని విద్యార్థి అరుణ్ చెబుతున్నాడు.