
ఉత్తరప్రదేశ్ అలీగఢ్ సమీపంలో డ్రైనేజ్ లో బైక్ పడిపోయిన వీడియో వైరల్ గా మారింది. బైక్ పైన ఉన్న పోలీస్ అధికారి దయానంద్, అతని భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నీట మునిగిన రహదారిపై వరద పోయేందుకు డ్రైనేజీ తెరిచినట్లు తెలిపారు దయానంద్. ఫ్రంట్ వీల్ కి ఏదో తగిలి.. బైక్ అమాంతం లేచి బోర్లా పడింది. బైక్ డ్రైనేజీలో కొట్టుకుపోయిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. స్మార్ట్ సిటీ అలీగఢ్... మేం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని అని ఈ వీడియోకు ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు రిటైర్డ్ ఐఎస్ అధికారి సూర్య ప్రతాప్ సింగ్.
#यूपी का स्मार्ट सिटी अलीगढ़।
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) June 19, 2022
किसे धन्यवाद दें? pic.twitter.com/VnwAqLRKQc