ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో.. తొలి పరీక్ష ఇయ్యాల్నే

ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో.. తొలి పరీక్ష ఇయ్యాల్నే
  • 11 జిల్లాల్లో 58 సీట్లకు పోలింగ్
  • ఉత్తరప్రదేశ్​లో ఇయ్యాల్నే ఫస్ట్​ ఫేజ్​ పోలింగ్


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్​లో గురువారం ఫస్ట్​ ఫేజ్​ పోలింగ్​ జరుగనుంది. యూపీలోని 58 నియోజక వర్గాల్లో 623 మంది పోటీ చేస్తున్నారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇయ్యాల(గురువారం) తొలి పరీక్ష జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్​లో ఫస్ట్​ ఫేజ్​మొదలుకానుంది. యూపీలోని 58 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రూల్స్​కు అనుగుణంగా బూత్​ల దగ్గర ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్​ కమిషన్​ తెలిపింది. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి వరకు వర్చువల్​గానే ప్రచారం నిర్వహించాయి. అతి తక్కువ మందితో ఇంటింటికీ వెళ్లి లీడర్లు ఓట్లడిగారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం వల్ల డబుల్​ ఇంజన్​ స్పీడ్​తో అభివృద్ధి పనులు పూర్తిచేస్తున్నామని బీజేపీ ప్రచారం చేయగా.. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి లీడర్లు అఖిలేశ్, చౌదరిలతో పాటు బీఎస్పీ చీఫ్​ మాయావతి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఫోకస్​ పెట్టగా.. తన హయాంలో లా అండ్​ ఆర్డర్​ను చాలా బాగా నిర్వహించానంటూ రాష్ట్ర ఓటర్లకు మాయావతి గుర్తుచేశారు. ఇంటింటి ప్రచారంపైనే కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఎక్కువ శ్రద్ధ పెట్టారు. దాదాపు అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో రైతులకు ఉచిత కరెంట్ కు చోటివ్వడంతో పాటు స్టూడెంట్లకు ట్యాబ్​లు, స్మార్ట్​ఫోన్​లు, స్కూటీలు అందిస్తామంటూ హామీలను పొందుపరిచాయి. రాష్ట్ర ప్రజలు తమకే పట్టం కడతారంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్​ ఫేజ్​లో భాగంగా.. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు జరగనున్న ఈ పోలింగ్​లో మొత్తం 623 మంది బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
9 మంది మంత్రులు ..
శ్రీకాంత్​ శర్మ, సురేశ్​ రాణా, సందీప్​ సింగ్, కపిల్​ దేవ్​ అగర్వాల్, అతుల్​ గార్గ్, చౌదరి లక్ష్మీ నారాయణ్, అనిల్​ శర్మ, జీఎస్ ధర్మేశ్, దినేశ్​ ఖాతిక్.. ఆగ్రా రూరల్​ నుంచి ఉత్తరాఖండ్​ మాజీ గవర్నర్​ బేబీ రాణి మౌర్య పోటీ చేస్తున్నారు.
పోలింగ్​ జరగనున్న జిల్లాలు..
షామిలి, హాపూర్, గౌతమ బుద్ధ నగర్, ముజఫర్​నగర్, మీరట్, బాఘ్​పత్, ఘజియాబాద్, బులంద్​షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా

కిందటి ఎలక్షన్​లో ఎవరికెన్ని?
2017 లో యూపీలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 58 సీట్లలో 53 నియోజకవర్గాల్లో బీజేపీ కేండిడేట్లు గెలవగా.. సమాజ్​ వాదీ పార్టీ, బహుజన్​ సమాజ్​ పార్టీ చెరో రెండు స్థానాలను, రాష్ట్రీయ లోక్​దళ్​ ఒక సీటు గెల్చుకున్నాయి.