సీబీఐతో విచారణకు రెడీ:యూపీ సర్కార్‌‌‌‌

సీబీఐతో విచారణకు రెడీ:యూపీ సర్కార్‌‌‌‌

లక్నో: ఉన్నావ్​ రేప్​ బాధితురాలికి జరిగిన యాక్సిడెంట్‌‌‌‌పై సీబీఐతో విచారణ  చేయించడానికి రెడీగా ఉన్నట్టు ఉత్తరప్రదేశ్‌‌‌‌ సర్కార్‌‌‌‌ సోమవారం ప్రకటించింది.  ఈ ఘటనతో సంబంధముందన్న అనుమానంతో  బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్​ సింగ్​ సెంగార్ పై పోలీసులు మర్డర్‌‌‌‌ కేసు పెట్టారు. రేప్‌‌‌‌ బాధితురాలు వెళుతున్న కారును ఆదివారం  రాయ్​బరేలి దగ్గర్లో ట్రక్కు   ఢీకొనడంతో  ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. ఆమెతోపాటు లాయర్​ మహేంద్ర సింగ్​కు పెద్ద గాయాలు తగలడంతో లక్నోలోని కేజీఎంయూ (కింగ్​ జార్జ్​ మెడికల్​ యూనివర్సిటీ) ట్రామా సెంటర్​కు  తరలించి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు.  ట్రక్‌‌‌‌ వేగంగా వెళుతోందని, ఆటైంలో వర్షం కూడా పడుతోందని  యూపీ డీజేపీ ఓపీ సింగ్‌‌‌‌ చెప్పారు.

బాధితుల బంధువులు రిక్వెస్ట్‌‌‌‌చేస్తే  ప్రమాదంపై సీబీఐ విచారణ  జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని  డీజేపీ చెప్పారు. ట్రక్కు ఢీకొనడం వెనక కుట్ర ఉందని బాధితురాలి అమ్మ  ఆరోపించారు. రేప్‌‌‌‌ బాధితురాల్ని చంపడానికి ప్రయత్నించారని ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌ రాహుల్‌‌‌‌గాంధీ  కూడా ఈ ఘటనపై ట్వీట్‌‌‌‌చేశారు. కాంగ్రెస్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ  ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్‌‌‌‌ అఖిలేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఈ ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్‌‌‌‌చేశారు. సుప్రీంకోర్టు జోక్యంచేసుకుని బాధితులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ చీఫ్‌‌‌‌ మాయావతి కోరారు.