కౌషంబీ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. బోగీల్లో నుంచి దూకేసిన ప్రయాణికులు

కౌషంబీ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. బోగీల్లో నుంచి దూకేసిన ప్రయాణికులు

ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ రైళ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి-సీల్దా ఎక్స్‌ప్రెస్ లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఓ బోగిలో అకస్మాత్తుగా  మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. తోపులాట జరిగింది. తోపులాటల మధ్య తమను తాము రక్షించుకోవడానికి పలువురు ప్రయాణికులు కిటికీలోంచి దూకారు.  కౌశాంబి జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఏమైందంటే..

12987 నెంబర్ గల  కౌశంబి-సీల్దా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలును ఆపేందుకు చైన్‌ లాగారు. కానీ  రైలు ఆగలేదు. దీంతో మరింత ఆందోళన చెందారు. రైళ్లో నుంచి దిగిపోవడానికి అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.ఈ క్రమంలో తోపులాట జరిగింది. కొందరు ప్రయాణికులైతే ఇతర ప్రయాణికుల మీద నుంచి నడుస్తూ బయటపడ్డారు. మరికొందరు ప్రయాణికులు కిటికీలోంచి దూకారు. సమాచారం అందుకున్న  రైల్వే సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.