ఎక్కువ బెర్తులు యూపీకే

ఎక్కువ బెర్తులు యూపీకే

న్యూఢిల్లీ: మోడీ కేబినెట్​లో ఉత్తరప్రదేశ్​కే ఎక్కువ పదవులు దక్కాయి. ఆ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది మంత్రులయ్యారు. అటుతర్వాత సెకండ్​ ప్లేస్​లో మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రానికి ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి. బీహార్​కు ఆరు, మధ్యప్రదేశ్​కు ఐదు, కర్నాటకకు 4, గుజరాత్​, హర్యానా, రాజస్థాన్​ రాష్ట్రాలకు మూడు చొప్పున పదవులు దక్కాయి. బెంగాల్​కు అధిక ప్రాధాన్యం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ గత కేబినెట్​లో మాదిరిగానే రెండు మంత్రి పదవులే దక్కాయి. ఒడిశా, జార్ఖండ్​, పంజాబ్​ రాష్ట్రాలకు రెండు చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్,  ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, తెలంగాణకు ఒక్కో బెర్త్​ దక్కింది.