బిగ్ బ్రేకింగ్ : స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు

బిగ్ బ్రేకింగ్ : స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు

స్కూల్ బస్సు.. ఎంతో సేఫ్టీగా ఉంటాయి.. పిల్లల భద్రతలో రాజీ అనేది ఉండదు.. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తూ.. తనిఖీలు చేస్తూ ఉంటుంది. స్కూల్ బస్సుల విషయంలోనే కాకుండా బస్సులోని పిల్లల భద్రత, ప్రవర్తనపైనా ఇప్పుడు ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే.. ప్రతి స్కూల్ బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌.వెంకటేశ్వర్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

అదే విధంగా అన్ని స్కూల్ బస్సుల్లో బస్సు లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (విఎల్‌టిఎస్) అమలు కోసం  రవాణా శాఖ ఇప్పటికే ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా నియమించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు,  ఇ-రిక్షాలు మినహా అన్ని ప్రజా రవాణా వాహనాలను వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.