బాలికకు క్షయవ్యాధి.. దత్తత తీసుకున్న గవర్నర్

బాలికకు క్షయవ్యాధి.. దత్తత తీసుకున్న గవర్నర్

లక్నో : ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ పెద్ద మనసు చాటుకున్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యంతోపాటు చదువు చెప్పిస్తానని తెలిపారు. గవర్నర్‌ అడుగుజాడల్లో నడిచిన రాజ్‌ భవన్‌ సిబ్బంది.. మరో 21 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు.

పిల్లలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తారు. 2025 నాటికి దేశం నుంచి క్షయను పూర్తిగా తరిమేద్దామనే ప్రధాని మోడీ పిలుపు మేరకు చర్యలు చేపట్టామని గవర్నర్‌ చెప్పారు. అందుకోసం రాజ్‌భవన్‌ నుంచే తమ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు.