డెంగ్యూ నివారణకు యోగి సర్కార్​ కఠిన చర్యలు 

డెంగ్యూ నివారణకు యోగి సర్కార్​ కఠిన చర్యలు 

ఉత్తరప్రదేశ్ లో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. పలు జిల్లాల్లో  ప్రజలు జ్వరాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు,పారామెడికల్​ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు. డెంగ్యూ వ్యాప్తిని నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఈసారి తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటావా జిల్లాలో డెంగ్యూ నివారణ చర్యలకు కేంద్రం ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని యూపీకి పంపించింది. 

యూపీలో ఇప్పటివరకు దాదాపు 3 వేల కేసులు నమోదు అయ్యాయి.రాబోయే రోజుల్లో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొరాదాబాద్​ జిల్లాలోని ఓ గ్రామంలో 62 కేసులు నమోదు అయ్యాయి. అందులో 35 మంది అస్వస్థతకు గురవ్వడంతో వారిని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. వారంతా డెంగ్యూ నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ గ్రామంలో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు.