
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. కరోనా మృతుల డేటా విషయంలో ప్రభుత్వం సరైన లెక్కలు బయట పెట్టడం లేదని అఖిలేశ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కరోనా పరిస్థితులను అదుపు చేయడంలో ఫెయిలైందని విమర్శించారు. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్‌ను కరోనా ప్రదేశ్‌గా మార్చిందన్నారు. కరోనా మృతుల విషయంలో ఫేక్ డేటాను ఇస్తున్నారంటూ యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా పేషెంట్లను బీజేపీ తమ కుటుంబీకులుగా భావించి, వారికి కావాల్సిన వైద్యాన్ని అందించాలన్నారు.