కోతి విశ్వాసం.. యజమాని అంత్యక్రియల కోసం 40 కి.మీ ప్రయాణం

కోతి విశ్వాసం.. యజమాని అంత్యక్రియల కోసం 40 కి.మీ ప్రయాణం

ప్రేమ, అనురాగం..అప్యాయత మనుషుల్లో కంటే జంతువుల్లోనే ఎక్కువ ఉంటుందని ఓ వానరం నిరూపించింది. తనకు అన్నం పెట్టిన యజమాని చనిపోతే..ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 40 కిలో మీటర్లు ప్రయాణించింది. అంత్యక్రియల్లో పాల్గొని..తన యజమానికి అంతిమ వీడ్కోలు పలికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

శవం ముందు కూర్చోని..

యూపీలోని అమ్రోహలో  రామ్ కున్వర్ అనే వ్యక్తి..రెండు నెలల క్రితం ఓ కోతితో స్నేహం చేశాడు. ఆ కోతి కూడా రామ కున్వర్ ప్రేమ, అప్యాయతన చూసి మురిసిపోయింది. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లేది. రామ్ కున్వర్ కూడా కోతికి రొట్టెలు తినిపించేవాడు. కన్నబిడ్డ లాగ సాదుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా కోతితో రామ్ కున్వర్ ఆడుకున్నాడు. అయితే అక్టోబర్ 10వ తేదీన రామ్ కున్వర్ అనార్యోగంతో చనిపోయాడు. ఈ వార్త విన్న కోతి గుండె పగిలింది. తన యజమాని చనిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. శవం ముందు కూర్చోని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఏడ్చింది.

అంత్యక్రియల కోసం 40 కి. మీ ప్రయాణం..

రామ్ కున్వర్ మృతదేహానికి తిగ్రి ధామ్ లో  అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే అమ్రోహకు తిగ్రి ధామ్ దాదాపు 40 కిలో మీటర్ల  దూరం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు డెడ్ బాడీని తీసుకెళ్తుండగా..తాను వస్తాను అన్నట్లు..బంధువులతో కలిసి వెళ్లింది. 40 కిలో మీటర్లు ప్రయాణించి..యజమాని అంత్యక్రియల్లో పాల్గొంది. యజమాని చితి దగ్గర కూర్చోని బాధపడింది. కోతి బాధపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ ప్రేమకు విలువ కట్టలేం..

యజమాని పట్ల కోతి చూపించిన ప్రేమపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కోతి ప్రేమకు విలువ కట్టలేమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ : మళ్లీ గెలిపిస్తే.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయిస్త : ఎంపీ అరవింద్