ఢిల్లీ-యూపీ సరిహద్దల్లో హై అలర్ట్ 

ఢిల్లీ-యూపీ సరిహద్దల్లో హై అలర్ట్ 

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న(శుక్రవారం) ఢిల్లీలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో ఆయుధాలతో పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సంచలన విషయాలు భయటకు వచ్చాయి. అతడికి ISIS ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు అతడితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు అక్రమంగా ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లోకి చొరబడినట్లు సమాచారం. దీంతో ఉత్తర ప్రదేశ్ హోమ్ శాఖ… పోలీసులను అప్రమత్తం చేసింది. చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలపై కూడా నిఘా పెంచాలని సూచించింది హోం శాఖ. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ హితేష్‌ చంద్ర అవాస్తీతో చర్చించి సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించాలని, చెక్‌పోస్టుల దగ్గర భద్రతలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించింది. కశ్మీర్‌లోనూ పాక్ చొరబాట్లకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సరిహద్దుల వెంట కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.