యూపీ పోలీసుల టెట్రిస్ చాలెంజ్

యూపీ పోలీసుల టెట్రిస్ చాలెంజ్

ఇద్దరు పోలీసులు నేలపై పడుకుని ఉంటారు. వారికి ఓ పక్కన బైక్, మరో పక్కన కారు. మధ్యలో ఫస్ట్ ఎయిడ్ కిట్, హెల్మెట్స్, జాకెట్స్, వాకీ టాకీలు, మంటలను ఆర్పే పరికరాలు. అన్ని రకాల ఎక్విప్ మెంట్స్ ఉంటాయి. ఇదీ యూపీ పోలీసులు ట్విట్టర్​లో పెట్టిన ఫొటో.  ‘ఎప్పుడైనా రెడీ..’ అంటూ కామెంట్​ పెట్టారు. ఇది ఆన్​లైన్​లో వైరల్ అయిపోతోంది. ఇంతకూ  వాళ్లెందుకు ఆ ఫొటోను అంత ప్రత్యేకంగా పెట్టారు? అంటే.. ఇది పోలీసు స్పెషల్​  సవాల్! పేరు టెట్రిస్ చాలెంజ్! ఈ నెల ఒకటిన స్విట్జర్లాండ్​లోని జూరిక్​ పోలీసులు స్టార్ట్​ చేశారు. ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బందితో సహా పోలీసులు, ఫైర్ డిపార్ట్​మెంట్, పారామెడికల్ సిబ్బంది వాడే వాహనాలు, పరికరాలు చూపించి వాళ్లు ఎంత వరకు రెడీగా ఉన్నారో చాటడం ఈ చాలెంజ్​ ఉద్దేశం.