బాలుడి కిడ్నాప్..హింట్ ఇచ్చి..పోలీసులకు దొరికిపోయిన కిడ్నాపర్

బాలుడి కిడ్నాప్..హింట్ ఇచ్చి..పోలీసులకు దొరికిపోయిన కిడ్నాపర్

ఉత్తర్ ప్రదేశ్ హర్దాయ్ లో 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ జరిగింది. కిడ్నాపరే చివరికి తన అమాయకత్వంతో పోలీసులకు దొరికిపోయాడు. సందిలా ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడు తన అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటుండగా.. 22ఏళ్ల రామ్ ప్రతాప్ సింగ్ ఆ బాలుడిని కిడ్నాప్ చేశాడు. అనంతరం కిడ్నాపర్ రామ్ ప్రతాప్..,బాలుడి తండ్రికి 2లక్షలు తీసుకొని సీతాపూర్ రా..పోలీసులకు చెబితే నీ కొడుకును హత్య చేస్తానంటూ మెసేజ్ చేశాడు. దీంతో కొడుకు కిడ్నాప్ పై కంగారు పడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు నిందితుడి ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలకు చెక్ చేశారు. చివరికి ఓ పదిమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కిడ్నాపర్ లేడు. ఈ క్రమంలో బాలుడి తండ్రికి నిందితుడు పంపిన రెండో మెసేజ్ ను చెక్ చేయగా..ఆ మెసేజ్ లో నిందితుడు తానెక్కడున్నాడో చెప్పాడు. రెండో మెసేజ్ లో నాకు పోలీస్ జాబ్ కావాలి. నేను హర్దియా నుంచి సీతాపూర్ వరకు పరిగెత్తగలను అంటూ హింట్ ఇచ్చాడు. అంతే ఆ మెసేజ్ ఆధారంగా ఎస్పీ అనురాగ్ నేతృత్వంలో పోలీసులు కిడ్నాపర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితుణ్ని కటకటాల్లోకి పంపారు.