ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత..రెండు సార్లు సీఎంగా, సైన్యంలో మేజర్ జనరల్‌‌‌‌‌‌‌‌గా దేశ సేవ

ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత..రెండు సార్లు సీఎంగా, సైన్యంలో మేజర్ జనరల్‌‌‌‌‌‌‌‌గా దేశ సేవ

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, రిటైర్డ్ మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి (91) దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని మాక్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మాజీ సైనికాధికారి అయిన ఆయన, రెండు పర్యాయాలు (2007-2009, 2011-2012) సీఎంగా పనిచేసి, అవినీతిపై కఠిన చర్యలతో రాష్ట్రంలో పారదర్శక, క్రమశిక్షణతో కూడిన పరిపాలనకు పునాది వేశారు. ఆయన మరణం పట్ల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఇది జాతీయ రాజకీయ రంగానికి పూడ్చలేని నష్టమన్నారు.