వివాదంలో సైరా.. జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవిపై ఫిర్యాదు

వివాదంలో సైరా.. జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవిపై ఫిర్యాదు

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహా రెడ్డి మూవీపై వివాదం తలెత్తింది.  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వారసులు చిత్ర యూనిట్ పై  ఫిర్యాదు చేశారు. కొణిదల ప్రొడక్షన్ అధినేతలైన చిరంజీవి, రాంచరణ్ ల పై ఫిర్యాదు చేశారు. సినిమా కథను తమ దగ్గర సేకరించారని..తమను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని ఫిర్యాదు చేశారు.సినిమా షూటింగ్ కు తమ ప్రాంతాలు, వస్తువులు వాడుకున్నారని అన్నారు. రూ. 50 కోట్లిస్తానని చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని ఆరోపించారు. ఇదే విషయంపై చిరంజీవి ఇంటికి వెళ్తే అక్రమంగా కేసులు పెట్టారన్నారు. చట్టపరంగా అగ్రీమెంట్ తీసుకుని చిత్ర యూనిట్ మోసం చేశారన్నారు ఉయ్యాల నరసింహారెడ్డి వారసులు.