V6 వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్: ఫస్ట్ ఇన్నింగ్స్ అప్డేట్స్

V6 వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్: ఫస్ట్ ఇన్నింగ్స్ అప్డేట్స్

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీన క్రీడాకారుల ట్యాలెంట్ ను వెలికి తీసే ఉద్ధేశంతో V6 వెలుగు, T20 క్రికెట్ టౌర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పది జిల్లాల క్రికెటర్లు ఇందులో భాగమయ్యారు. ఈ రోజు టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ LB స్టేడియంలో జరుగుతుంది. ఇందులో నిజామాబాద్ అర్బన్ తో మహబూబ్ నగర్ తలపడుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు అతిథిగా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

మహబూబ్ నగర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణిత 20 ఒవర్లకు 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లడ్డు గణేశ్ 50 పరుగులతో రాణించాడు.