రాష్ట్రంలో రెండు రోజులు వ్యాక్సినేషన్ బంద్

రాష్ట్రంలో రెండు రోజులు వ్యాక్సినేషన్ బంద్

రాష్ట్రంలో ప్రజలు ఒకపక్క వ్యాక్సిన్ దొరకక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క వ్యాక్సినేషన్‌ను ఆపేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాంతో వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వాళ్లు తీవ్ర భయాందోళనలో పడ్డారు. కాగా.. కోవిషీల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాంతో కోవిన్ పోర్టల్ అప్‌డేట్ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా శనివారం మరియు ఆదివారం వ్యాక్సినేషన్ ఆపేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దాంతో సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిలిచిపోయింది. సోమవారం నుంచి తిరిగి యధావిధిగా వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని అధికారులు తెలిపారు.